- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Economy: భారత వృద్ధి అంచనాను తగ్గించిన గోల్డ్‌మన్ శాక్స్
ఈ ఏడాది ఆర్‌బీఐ పాలసీ రేట్లలో 50 బేసిస్ పాయింట్లను పెంచే అవకాశం ఉందని కూడా పేర్కొంది.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి రేటును ప్రముఖ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ శాక్స్ భారీగా తగ్గించింది. భారత కరెన్సీ రూపాయి విలువ తీవ్రమైన క్షీణతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2026 ఏడాదికి సంబంధించి దేశ వృద్ధిని అంచనాను 5.9 శాతానికి సవరించినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో ఈ ఏడాది ఆర్‌బీఐ పాలసీ రేట్లలో 50 బేసిస్ పాయింట్లను పెంచే అవకాశం ఉందని కూడా పేర్కొంది. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ముందు తాము వృద్ధిని 7 శాతంగా అంచనా వేశాం. అయితే, తర్వాత పరిణామాలను సమీక్షించి వృద్ధిని సవరించినట్టు గోల్డ్‌మన్ శాక్స్ మంగళవారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. చమురు ధరలు, సరఫరా అంతరాయాలను పరిగణలోకి తీసుకుని, ఇటీవలి మార్పుల నేపథ్యంలో వృద్ధి అంచనాలో తాజా కోత విధించినట్టు విశ్లేషకులు నివేదికలో పేర్కొన్నారు. ముడి చమురు ధరల వల్ల భారత్ విదేశీ మారకద్రవ్య, ద్రవ్యోల్బణం, ఆర్థికపరమైన సవాళ్లను ఎదుర్కొంటుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది దేశ ద్రవ్యోల్బణం 4.6 శాతానికి పెరుగుతుందని భావిస్తున్నారు.






