- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold rates: రన్ రాజా రన్ అంటున్న బంగారం.. లక్షకు అరడుగు దూరంలో ధరలు
పుష్ప సినిమాలో తగ్గేదెలే అంటూ హీరో అల్లు అర్జున్ చేసే రచ్చ మాములుగా ఉండదు.

దిశ, వెబ్ డెస్క్: పుష్ప సినిమాలో తగ్గేదెలే అంటూ హీరో అల్లు అర్జున్ చేసే రచ్చ మాములుగా ఉండదు. ఇప్పుడు బంగారం ధరలు కూడా అలాగే తగ్గేదెలే అంటూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. వారం క్రితం స్వల్పంగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. ఇప్పుడు గత రికార్డులను బద్దలుకొడుతూ ఆల్ టైం హైయెస్ట్ ధరలను నమోదు చేస్తున్నాయి. దీంతో సాధారణ ప్రజలు బంగారం కొనాలంటే.. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దేశంలో గడిచిన 3 రోజుల్లో చూస్తే 2 వేలకి పైగానే పెరిగింది. ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర దాదాపు లక్ష రూపాయలకు చేరువలో ఉంది.
ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ నేపథ్యంలో ఇవాళ బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. గురువారంతో పోల్చితే 24 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.270 పెరిగి రూ.98,380 గా ఉంది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాములపై రూ.250 పెరిగి రూ.96,410కి చేరింది. కిలో వెండి ధర రూ.99,900గా నమోదైంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.97,580గా ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ.89,450గా ఉంది. కిలో వెండి ధర రూ.1,09,900గా ఉంది. అయితే, ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్, త్వరలో అక్షయ తృతీయ వస్తుండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రాంతాల వారీగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది. ఇంకా ప్రతిరోజూ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి.
అమెరికా-చైనా దేశాల మధ్య సుంకాల యుద్ధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం భయాలు పెరుగుతున్నాయి. ప్రపంచ మార్కెట్‌లో అనిశ్చిత పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలో మదుపరులు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా భావిస్తున్నారు. అందుకే అటువైపు పెట్టుబడులు పెరిగి గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయని మార్కెట్లు నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, ఈ అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నంత వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని అభిప్రాయపడుతున్నారు. అలాగే, డాలర్ ఇండెక్స్ బలహీన పడడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించొచ్చన్న ముందస్తు అంచనాలు కూడా బంగారం ధర పెరగడానికి కారణమని పేర్కొంటున్నారు.






