- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: ఈ ఏడాది కూడా బంగారం పైపైకే
బంగారం ధర అదే సమయంలో 10 గ్రాములకు రూ. 70,500 నుంచి రూ. 1,52,840 (117 శాతం) పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా బంగరం ధరలు తగ్గకపోవచ్చని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధ భయాలు, పెరుగుతున్న ఆర్థిక మాంద్యం ప్రమాదాలు బంగారం, వెండి డిమాండ్‌ను ఇంకా పెంచే అవకాశం ఉంది. దేశీయంగా 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2025, ఏప్రిల్ 1న కిలోకు రూ. 1,01,360గా ఉన్న వెండి ధర, ప్రస్తుతం రూ. 2.60 లక్షలతో (152.2 శాతం) పెరిగింది. బంగారం ధర అదే సమయంలో 10 గ్రాములకు రూ. 70,500 నుంచి రూ. 1,52,840 (117 శాతం) పెరిగింది. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో బంగారం, వెండి ధరలకు గిరాకీ బలంగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ సవాళ్లు, ప్రపంచ మాంద్యం భయం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోంది. కాబట్టి సురక్షిత ఆస్తులైన బంగారం, వెండి డిమాండ్ కొనసాగుతుందని ఛాయిస్ బ్రోకింగ్‌కు చెందిన కమోడిటీ అండ్ కరెన్సీ అనలిస్ట్ అమీర్ మక్దా పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కొంత దిద్దుబాటుకు గురవ్వొచ్చని అమీర్ వెల్లడించారు.






