- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం, వెండి ధరలు తగ్గడం కలేనా?.. మళ్లీ భారీగా పెరిగిన ధరలు
బంగారం, వెండి ధరలు తగ్గడమనేది కలగానే మిగిలిపోతుందా? ప్రతీరోజూ పెరుగుతున్న ధరలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు తగ్గడమనేది కలగానే మిగిలిపోతుందా? ప్రతీరోజూ పెరుగుతున్న ధరలు చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. బంగారం కాదు కదా.. గతేడాది సామాన్యుడికి సరసమైన ధరకు లభించే వెండి కూడా ఇప్పుడు ఆకాశాన్నంటింది. పెరుగుతున్న ధరలతో ఏ రోజుకు ఆ రోజే బంగారం, వెండి రేట్లు ఆల్ హై రికార్డులను నమోదు చేస్తున్నాయి. పెళ్లిళ్లు, పండుగలు, ఇతర శుభకార్యాల సమయంలో నగల కొనాలన్న ఊహే మధ్యతరగతి, ఆలోపు వారిని దిగులు చెందేలా చేస్తోంది. తాజాగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు పెరిగిన ధరలతో బంగారం లక్ష 60 వేల మార్కును దాటగా.. వెండి రూ.4 లక్షలకు పాతికవేల దూరంలో ఉంది.
బులియన్ మార్కెట్ లో నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2450 పెరిగి.. రూ.1,62,710కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2250 పెరిగి రూ.1,49,150కి చేరింది. 18 క్యారెట్ల ధర కూడా కొత్త రికార్డు నమోదు చేసింది. 10 గ్రాముల బంగారం రూ.1840 పెరిగి.. రూ.1,22,030కి చేరింది. వెండి ధర కూడా భారీగా పెరిగింది. కిలో వెండి ధర ఏకంగా రూ.10 వేలు పెరగడంతో ధర రూ.3,75,000కు చేరింది. హైదరాబాద్ సహా తెలుగురాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు దాదాపు ఇలాగే ఉన్నాయి. వెండి పరుగులు చూస్తుంటే ఈ వారాంతం లోపు రూ.4 లక్షలు క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో.






