- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold and Silver: ఇంకా పెరగనున్న బంగారం, వెండి ధరలు
పెట్టుబడిదారులు ప్రపంచ ద్రవ్యోల్బణ డేటా, వివిధ సెంట్రల్ బ్యాంకుల పాలసీ నిర్ణయాల ఆధారంగా దృష్టి సారిస్తారు

దిశ, బిజినెస్ బ్యూరో: రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు మరిన్ని కొత్త రికార్డులను నమోదు చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. గతవారమే బంగారం కొత్త రికార్డులతో తులం రూ. 1.34 లక్షలు దాటేసింది. వెండి రూ. 2.10 లక్షలతో కొత్త గరిష్ఠాలను అధిగమించింది. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు ప్రపంచ ద్రవ్యోల్బణ డేటా, వివిధ సెంట్రల్ బ్యాంకుల పాలసీ నిర్ణయాల ఆధారంగా సురక్షిత సాధనాలైన బంగారం, వెండిపై ఎక్కువ దృష్టి సారిస్తారు. ముఖ్యంగా భారత్‌తో పాటు యూఎస్, యూరప్, యూకే దేశాల ద్రవ్యోల్బణ గణాంకాలు, ప్రధాన ఆర్థికవ్యవస్థలలో తయారీ, సేవల రంగాలకు సంబంధించిన పీఎంఐ డేటాను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విలువైన లోహాలకు అధిక డిమాండ్ ఏర్పడి ధరలు మరింత పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అమెరికాలో నిరుద్యోగ డేటా, ఇళ్లు, వినియోగదారుల డేటాను ఎక్కువగా ట్రాక్ చేస్తారు. ఇవి బులియన్ మార్కెట్లో ధరలను ప్రభావితం చేస్తాయని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కమొడిటీ, కరెన్సీ రీసెర్చ్ వైస్-ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ చెప్పారు. వాణిజ్య సవాళ్లు, అమెరికా విధించిన అధిక సుంకాలకు సంబంధించి కొనసాగుతున్న ఒప్పందాల్లో పురోగతి లేకపోవడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ రికార్డు స్థాయిలో పడిపోవడంతో గత వారం బంగారం ధరలు పెరిగాయి. కరెన్సీ బలహీనత కారణంగా బంగారంలో పెట్టుబడికి గిరాకీని పెంచుతుందని స్మార్ట్‌వెల్త్ ఏఐ వ్యవస్థాపకుడు పంకజ్ సింగ్ పేర్కొన్నారు.






