- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: తొలిసారి రూ.1.4 లక్షలకు చేరిన బంగారం ధర
ఈ సంవత్సరం ఇప్పటివరకు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు 78.40 శాతం పెరిగాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు మరోసారి పరుగులు పెడుతోంది. ఇటీవల కాస్త నెమ్మదించిన ధోరణి కనిపించినప్పటికీ, మంగళవారం తిరిగి రికార్డు గరిష్ఠాలకు చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, అంతర్జాతీయ పరిణామాల కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం బంగారం ధరలు రూ. 2,650 పెరిగి 10 గ్రాములకు రూ. 1,40,850 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛమైన పసిడి పది గ్రాములు రూ. 2,400 పెరిగి రూ. 1,38,650కి చేరింది. ఆభరణాల తయారీ వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 2,200 పెరిగి రూ. 1,27,000కి చేరింది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు 78.40 శాతం పెరిగాయి. వెండి ధరలు కూడా కిలోకు రూ. 3,000 పెరిగి రూ. 2,34,000 (అన్ని పన్నులతో కలిపి) వద్ద రికార్డు స్థాయికి చేరుకుంది. గడిచిన ఏడాది కాలంలో వెండి కూడా ఊహించని స్థాయిలో 142 శాతానికి పైగా పెరిగింది. ఇక, గ్లోబల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 4,498 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ తొలిసారి 70 డాలర్లు దాటింది. వచ్చే ఏడాదిలో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు, భౌగోళిక పరిస్థితులు బంగారం ధరలను ప్రభావిస్తం చేస్తున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.






