మళ్లీ పెరిగిన బంగారం.. తులం రూ. 1.22 లక్షలు

by S Gopi |

దీంతో వరుస రెండు రోజులుగా పెరిగిన పసిడి ధరలకు బ్రేక్ పడింది.

మళ్లీ పెరిగిన బంగారం.. తులం రూ. 1.22 లక్షలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గత కొన్ని సెషన్లుగా తగ్గిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బుధవారం దేశ రాజధానిలో బంగారం ధరలు రూ. 2,600 పెరిగి రూ. 1,24,400కి చేరుకున్నాయి. దీంతో వరుస రెండు రోజులుగా పెరిగిన పసిడి ధరలకు బ్రేక్ పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ వివరాలు వెలువడనున్న నేపథ్యంలో చాలామంది పెట్టుబడిదారులు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారం కోసం ఆసక్తి చూపించారు. దీనికి తోడు మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఆందోళనలు కూడా పసిడి ధరల పెరుగుదలకు కారణమని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ కమోడిటీస్ సీనియర్ విశ్లేషకుడు సౌమిల్ గాంధీ అన్నారు. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 1,580 పెరిగి రూ. 1,22,400కి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ. 1,450 పెరిగి రూ. 1,12,200 వద్ద ఉంది. వెండి ధరలు కూడా కిలోకు రూ. 1,66,000గా ఉంది. గ్లోబల్ మార్కెట్లలోనూ ఫెడ్ ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఔన్స్ బంగారం తిరిగి 4,029.53 డాలర్లకు చేరింది.

Next Story