- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: మళ్లీ రూ. 98 వేలు దాటిన బంగారం
అంతర్జాతీయ పెరిగిన అనిశ్చితి, దేశీయ డిమాండ్ కారణంగా దేశ రాజధానిలో స్వచ్చమైన బంగారం పది గ్రాములు రూ. 98,250కి చేరింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగింది. వారం ప్రారంభంలో రూ. 5,000 వరకు తగ్గించిన పసిడి బుధవారం తిరిగి రూ. 2,400 ఖరీదైంది. అంతర్జాతీయ పెరిగిన అనిశ్చితి, దేశీయ డిమాండ్ కారణంగా దేశ రాజధానిలో స్వచ్చమైన బంగారం పది గ్రాములు రూ. 98,250కి చేరింది. ప్రధానంగా అమెరికా కరెన్సీ డాలర్ విలువ పడిపోవడంతో సురక్షిత పెట్టుబడి సాధనంగా బంగారంపై ఎక్కువమంది ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిస్తునారు. ఇదే సమయంలో అమెరికా క్రెడిట్ రేటింగ్‌ను మూడీస్ తగ్గించడంతో ఆర్థిక లోటు తప్పదనే ఆందోళనలు పెరిగాయి. మరోవైపు అమెరికా ఆర్థికవ్యవస్థ వృద్ధిపై ప్రతికూలత, ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు వంటి గ్లోబల్ మార్కెట్ పరిణామాలు బంగారం ధరలు పెరిగేందుకు దోహదపడ్డాయి. దేశీయంగా కూడా ఈ పరిణామాలు ప్రభావం చూపడంతో హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రూ. 2,400 పెరిగి రూ. 97,420 ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్లు 10 గ్రాములు రూ. 2,200 పెరిగి రూ. 89,300 వద్దకు చేరింది. ఇక, అంతర్జాతీయ మార్కెట్లోనూ ఔన్స్ బంగారం 3,311 డాలర్లకు చేరుకుంది. వెండి కూడా రూ. 3 వేలు పెరిగి రూ. 1,11,000 చేరుకుంది.






