- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊరటనిచ్చిన బంగారం.. స్థిరంగా వెండి : తరుగు, జీఎస్టీతో నేటి ధరలివే!
మూడు రోజుల పతనం తర్వాత.. నిన్న పెరిగిన బంగారం ధర.. నేడు స్వల్పంగా తగ్గి కొనుగోలు దారులకు ఊరటనిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: మూడు రోజుల పతనం తర్వాత.. నిన్న పెరిగిన బంగారం ధర.. నేడు స్వల్పంగా తగ్గి కొనుగోలు దారులకు ఊరటనిచ్చింది. అధికమాసం కావడంతో కొన్ని ప్రాంతాల్లో వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడింది. ప్రధాని మోడీ బంగారం కొనుగోలు తగ్గించాలని పిలుపునివ్వడంతో కూడా బంగారం ధర తగ్గుతూ వస్తోంది. మంగళవారం ఉదయం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాములపై బంగారం ధర స్వల్పంగా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.490 తగ్గి రూ.1,83,296 వద్ద కొనసాగుతోంది. తరుగు, జీఎస్టీ కలిపి రూ.1,68,022గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.450 తగ్గి రూ.1,45,650కి దిగివచ్చింది. తరుగు, జీఎస్టీ కలిపి 1,68,022గా ఉంది. మరోవైపు వెండి ధర వరుసగా ఐదోరోజు స్థిరంగా కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.2,95,000గా ఉంది. దీనిపై జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. వాటితో కలిపి కిలో వెండి రేటు ప్రస్తుతం రూ.3,40,300గా ఉంది.






