- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బంగారం ప్రియులకు షాక్: రూ.1.50 లక్షలు దాటిన 10 గ్రాముల ధర
దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు పెరిగాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు మరోసారి ఆకాశాన్ని తాకాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. కొద్దిరోజులుగా ధరల్లో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. వరుసగా రెండ్రోజులు తగ్గిన బంగారం ధర.. నేడు స్వల్పంగా పెరిగి.. వినియోగదారులకు షాక్ ఇచ్చింది.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ. 440 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ. 1,51,370కి చేరింది. అలాగే.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ. 400 పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,38,750 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు అమాంతం పెరిగినప్పటికీ, వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా ఉన్నాయి. పారిశ్రామికంగా డిమాండ్ ఉన్నప్పటికీ, ధరల్లో ఎలాంటి మార్పు లేకుండా కిలో వెండి ధర రూ. 2,65,000 వద్దే కొనసాగుతోంది. అయితే.. రాబోయే రోజుల్లో వెండి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.






