- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: ఆల్‌టైమ్ హైలో బంగారం ధరలు
ఆల్‌టైమ్ హైకు బంగారం ధరలు చేరిపోయాయి...

దిశ, వెబ్ డెస్క్: పది రోజులుగా పసిడి ధరలు(Gold Rates) పరుగులు పెడుతున్నాయి. నిన్న ఉన్న ధరలు ఇవాళ ఉండటం లేదు. ఇలా ప్రతి రోజూ రేట్స్ పెరిగిపోతున్నాయి. గతంలో బంగారం ధరలో హెచ్చు తగ్గులు ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో పెరడగమే గానీ, తగ్గడం ఉండటం లేదు. తాజాగా గోల్డ్ రేట్ మరింత హైక్‌కు చేరింది. 10 గ్రాముల బంగారం ఆల్ టైమ్ రికార్డు ధర పలుకుతోంది. యూఎస్ డాలర్, ట్రెజరీ దిగుబడిలో పతనం కారణంగా దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి.
తాజాగా దేశంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,160 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.79,900గా వ్యాపారులు విక్రయిస్తున్నారు. అటు వెండి(Silver) ధర కూడా స్వల్పంగా పెరిగింది. హైదరాబాద్(Hyderabad)లో కిలో వెండి ధర రూ.1,00,500కు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో అంతర్జాతీయంగా వెండి ధరలు కూడా పెరిగాయని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.






