మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందో తెలిస్తే తట్టుకోలేరు!

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-14 11:32:15  IST  )

బంగారం ధరలు(Gold Price) మరోసారి షాకిచ్చాయి.

మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతుందో తెలిస్తే తట్టుకోలేరు!
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు(Gold Price) మరోసారి షాకిచ్చాయి. తాజాగా రూ.లక్షా 30 వేలు దాటింది. ప్రస్తుతం అక్షరాలా రూ. లక్షా 30 వేల 240 లుగా కొనసాగుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా లక్షా 85 వేల మార్క్ దాటింది. వడ్డీ రేట్లలో అమెరికా ఫెడ్ రిజర్వ్ కోత పెడుతుందన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పసిడికి డిమాండ్‌ను పెంచాయి. గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరగడం కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ధరల పెరుగుదల ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

Next Story