Today Gold Rates: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు!

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-11 14:24:46  IST  )

నేడు గోల్డ్ రేట్లు భారీగా పెరిగితే సిల్వర్ రేట్లు భారీగా తగ్గి బిగ్ ఊరటనిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,26,500 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.650 పెరిగి రూ.1,27,150 గా ఉంది.

Today Gold Rates: పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. నేడు భారీగా పెరిగిన బంగారం ధరలు!
X

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ మన దేశంలో గోల్డ్‌కి మరింత పాపులారిటీ ఎక్కువ. ఇక ఈ మధ్య కాలంలో బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఓ రోజు పెరిగి బిగ్ షాకిస్తుంటే మరో రోజు తగ్గి రిలీఫ్‌ను కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో నేడు గోల్డ్ రేట్లు భారీగా పెరిగితే సిల్వర్ రేట్లు భారీగా తగ్గి బిగ్ ఊరటనిచ్చాయి. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్న రూ.1,26,500 ఉన్న 22 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.650 పెరిగి రూ.1,27,150 గా ఉంది. అలాగే నిన్న రూ.1,38,000 ఉన్న 24 క్యారెట్ల బంగారం ధరపై నేడు రూ.710 పెరిగి రూ.1,38,710కు చేరుకుంది. ఇక అటు వెండి ధర రూ.4000 తగ్గి కిలో రూ.2,68,000గా ఉంది. కాగా దాదాపు రెండు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే ఉన్నాయి.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.1,27,150
24 క్యారెట్ల బంగారం ధర - రూ.1,38,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.1,27,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.1,38,710

Next Story