భారీగా తగ్గిన బంగారం ధరలు

by Muthe.Rajitha |   (  Updated:2025-10-28 11:30:53  IST  )

గత కొద్దిరోజులుగా దూసుకుపోయిన బంగారం ధరలు నేడు మరోసారి భారీగా తగ్గాయి.

భారీగా తగ్గిన బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : గత కొద్దిరోజులుగా దూసుకుపోయిన బంగారం ధరలు నేడు మరోసారి భారీగా తగ్గాయి. అంతేకాదు ఈరోజు ఒక్కరోజే గంటల వ్యవధిలో రెండుసార్లు గోల్డ్ రేట్స్ బాగా పడిపోయాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన 10 గ్రాముల బంగారం మీద రూ.2560 తగ్గి రూ.1,20,820కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారంపై రూ.2,250 తగ్గి రూ.1,10,750కి చేరింది. మరోవైపు కేజీ వెండి ధర ఏకంగా రూ.5 వేలు తగ్గి రూ.1,65,000 కు చేరింది. కాగా అమెరికా- చైనా మధ్య త్వరలో ట్రేడ్‌ డీల్‌ కుదరొచ్చన్న అంచనాలు ఈ తగ్గుదలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య అక్టోబర్‌ 30న జరిగే భేటీలో ఆ మేర కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో బంగారానికి డిమాండ్‌ తగ్గినట్లు అంచనా వేస్తున్నారు.

Read More... పెళ్లిలో అక్షింతలు పట్టు.. కట్నాలు స్కానర్‌కు కొట్టు..! క్యాష్‌లెస్ కట్నం.. వధువు తండ్రి వినూత్న ఆలోచన

FAKE POSTER : వాట్సాప్, ఫోన్ కాల్స్ కొత్త నియమాలు ఫేక్.. హైదరాబాద్ పోలీస్ హెచ్చరిక

Amazon: అమెజాన్‌లో 30,000 మంది తొలగింపు

Next Story