Gold: రికార్డు గరిష్ఠాల నుంచి రూ. 8,000 తగ్గిన బంగారం

by S Gopi |

కొన్ని వారాలుగా బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలను తీసుకోవడం ప్రారంభించారు.

Gold: రికార్డు గరిష్ఠాల నుంచి రూ. 8,000 తగ్గిన బంగారం
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు మరోసారి భారీగా దిగి వచ్చాయి. దేశీయ మార్కెట్లతో పాటు అంతర్జాతీయంగా కూడా గురువారం పసిడి ధరలు గణనీయంగా తగ్గాయి. అమెరికా, చైనా మధ్య టారిఫ్ ఉద్రిక్తతలు గ్లోబల్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ పెంచాయి. దీంతో కొన్ని వారాలుగా బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారు లాభాలను తీసుకోవడం ప్రారంభించారు. ఇదే సమయంలో అమెరికా 10 ఏళ్ల బాండ్ల రాబడి 4.50 శాతానికి పెరగడంతో బంగారం, వెండి వంటి ఖరీదైన లోహాలపై ఒత్తిడి ఏర్పడింది. దీనికి తోడు అమెరికా కరెన్సీ డాలర్ బలపడటం, ఆ దేశంలో ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పట్టం, ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు, అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ పరిస్థితులు నెమ్మదించడం, భారత్, పాక్ ఉద్రిక్త పరిస్థితులు తగ్గడం పసిడి ధరల తగ్గుదలకు మద్దతిచ్చాయి. ఈ కారణంగానే రికార్డు గరిష్ఠం 10 గ్రాములకు రూ. 99,358 నుంచి రూ. 7,900 వరకు క్షీణించాయి. గురువారం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 2,130 తగ్గి రూ. 93,930కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 1,950 పడిపోయి రూ. 86,100 వద్ద ఉంది. వెండి ధర కిలోకు రూ. 1,000 తగ్గి రూ. 1,08,000 ఉంది.

Next Story