బంగారం ప్రియులకు షాక్.. పెరుగుతూనే ఉన్న ధరలు

by Gantepaka Srikanth |

హిందువులు జరుపుకునే పండుగలు అన్నింటిలో దీపావళికి ప్రత్యేకత ఉంటుంది.

బంగారం ప్రియులకు షాక్.. పెరుగుతూనే ఉన్న ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: హిందువులు జరుపుకునే పండుగలు అన్నింటిలో దీపావళికి ప్రత్యేకత ఉంటుంది. ఈ పండుగ వేళ అన్ని వస్తువుల ధరలు తగ్గుతుంటాయి. వాహనాలు, వస్త్రాలు, వస్తువులు ఇలా అన్నింటి ధరలపైనా డిస్కౌంట్లు ఉంటాయి. కానీ.. బంగారం ధరల్లో(Gold Price) ఏమాత్రం డిస్కౌంట్లు, ఆఫర్లు కనిపించకపోగా.. జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు పెరిగాయి. శుక్రవారం ఒక్క రోజులోనే తులం బంగారం రూ.3,770 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,35,180 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,690గా ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,85,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు అమలులో ఉంటాయి. మరోవైపు దేశ వ్యాప్తంగా దీపావళి పర్వదినం సందర్భంగా బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ వారాంతం మొత్తం దీపావళి కొనుగోళ్లు కొనసాగుతాయి. అయితే ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story