నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తున్న గోల్డ్ రేట్స్.. ఇవాళ ఎంత పెరిగిందంటే?

by Gantepaka Srikanth |   (  Updated:2025-10-15 09:28:46  IST  )

బంగారం ధర(Gold Price) పెరుగుతూనే ఉంది. కనికరం లేకుండా రోజురోజుకూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది.

నాన్‌స్టాప్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకెళ్తున్న గోల్డ్ రేట్స్.. ఇవాళ ఎంత పెరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధర(Gold Price) పెరుగుతూనే ఉంది. రోజురోజుకూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది. నిన్న రూ.లక్షా 30 వేల 240 లుగా ఉన్న గోల్డ్ రేట్స్.. ఇవాళ రూ.లక్షా 30 వేల 850కి చేరింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి ధర ఏకంగా లక్షా 85 వేల మార్క్ దాటింది. వడ్డీ రేట్లలో అమెరికా ఫెడ్ రిజర్వ్ కోత పెడుతుందన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పసిడికి డిమాండ్‌ను పెంచాయి. గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరగడం కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ధరల పెరుగుదల ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు.

Next Story