- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
షాక్ మీద షాకిస్తున్న బంగారం ధరలు.. మళ్లీ లక్షకు చేరువకు పసిడి పరుగులు.. తులం ఎంతుందంటే..?
మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము.

దిశ, వెబ్‌డెస్క్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఇక అందులోనూ పెళ్లి సీజన్ వచ్చిందంటే గోల్డ్‌కి మరింత గిరాకీ పెరిగి కొనుగోలు కూడా పెరుగుతుంది. అయితే భారతదేశంలో పసిడికి కొంచెం మక్కువ ఎక్కువే. ఒంటినిండా నగలతో సింగారించుకుని మహిళలు తెగ సంబరపడిపోతుంటారు. ఇక డబ్బున్నోళ్లు ఎలా అయినా బంగారం కొనుగోలు చేసి ధరిస్తారు. కానీ సామాన్య ప్రజలు గ్రాముల్లో అయినా తీసుకొని హ్యాపీగా ఫీలవుతుంటారు. ఈ మధ్య కాలంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
దీంతో సామాన్య ప్రజలు నిరాశకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.430 పెరిగి రూ.99,600కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ.400 పెరిగి రూ.91,300 వద్ద కొనసాగుతోంది. ఇక కేజీ వెండిపై రూ.వెయ్యి పెరిగి ధర రూ.1,14,00కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు కాస్త అటు ఇటుగా ఇవే ధరలు ఉన్నాయి. నేడో, రేపో మళ్లీ ధర రూ.లక్షకు చేరే చాన్స్ లేకపోలేదు.
నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర - రూ.91,300
24 క్యారెట్ల బంగారం ధర - రూ.99,600
నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే
22 క్యారెట్ల బంగారం ధర – రూ.91,300
24 క్యారెట్ల బంగారం ధర – రూ.99,600






