- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold rates: భగ్గుమంటున్న బంగారం ధరలు.. మరోసారి పెరిగిన పసిడి
మహిళలకు బంగారం అంటే ఎంతో ఇష్టమని అందరికి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: మహిళలకు బంగారం (Gold) అంటే ఎంతో ఇష్టమని అందరికి తెలిసిందే. అయితే, బంగారాన్ని అలంకరణ కోసమే కాకుండా పెట్టుబడిగానూ (Investment) చూస్తారు. ఎప్పటి కప్పుడు పుత్తడి ధర (Gold rates) దిగివస్తుందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ, పసిడి మాత్రం రికార్డు స్థాయిలో పరుగులు పెడుతుంది. అయితే అంతర్జాతీ య బులియన్ మార్కెట్లో మార్పుల కారణంగా.. దేశీయంగా కూడా గోల్డ్, సిల్వర్ ధరలపై ప్రభావం పడుతుంది. ఇక తాజాగా మరోసారి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర బుధవారం రూ.92,990 ఉండగా రూ.540 పెరిగి రూ.93,530కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు బుధవారం రూ.85,250 ఉండగా రూ.500 పెరిగి రూ.85,750కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ.92,840 ఉండగా గురువారం రూ.93,380 వద్దకు చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం 85,100 ఉండగా గురువారం 85,600కు చేరింది. అలాగే, బుధవారం కిలో వెండి ధర రూ.1,03,000 ఉండగా, గురువారం రూ.1,13,900కు చేరుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతాయి.
కాగా, ఈ ధరలు ఉదయం 10 గంటల సమయానికి నమోదయ్యాయి. బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. బంగారం కొనాలనుకునే వారు ఆ సమయానికి వారి పట్టణంలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుని వెళ్లగలరు.






