మళ్ళీ దూసుకుపోతున్న బంగారం ధరలు

by Muthe.Rajitha |

నిన్న ఒక్కరోజే రూ.9వేలు తగ్గిన బంగారం ధరలు నేడు మాత్రం మళ్ళీ దూసుకుపోయాయి.

మళ్ళీ దూసుకుపోతున్న బంగారం ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : నిన్న ఒక్కరోజే రూ.9వేలు తగ్గిన బంగారం ధరలు నేడు మాత్రం మళ్ళీ దూసుకుపోయాయి. నిన్నటితో పోల్చితే నేడు రూ.2 వేలు పెరిగింది. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.1,27,210 కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,14,650 కి చేరింది. ఇక వెండి ధరలు రూ.3 వేలు పెరిగి కేజీకి రూ.1,59,500 కి చేరింది.

అయితే ఇన్వెస్టర్స్ లాభార్జన కోసం అమ్మివేయడం, అమెరికా డాలర్‌ బలోపేతం కావడం, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త తగ్గడం వల్ల నిన్నటి వరకు బంగారం, వెండి ధరలు దిగి వచ్చినా.. రానున్న పెళ్లిళ్ల సీజన్ దృష్ట్యా... దేశీయంగా గిరాకీ పెరగడంతో మళ్ళీ ధరలు ఊపందుకుంటున్నాయి. అటు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 4,121 డాలర్లుగా ఉండగా... ఔన్సు వెండి ధర 49.18 డాలర్లకు చేరింది.

Next Story