తగ్గేదే లే అంటున్న బంగారం.. శాంతించిన వెండి

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-24 04:42:41  IST  )

బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ.. కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి.

తగ్గేదే లే అంటున్న బంగారం.. శాంతించిన వెండి
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూ.. కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఊహించని రీతిలో పెరుగుతున్న ధరలు చూసి.. సామాన్యుడు భవిష్యత్తులో వాటిని కొనడమే కష్టమన్న ఆలోచనకు వస్తున్నాడు. ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకు తోడు.. వెండి, బంగారానికి పెరుగుతున్న డిమాండ్, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు వాటి ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయని నిపుణులు ఇప్పటికే వెల్లడించారు. కొద్దిరోజుల్లో మూఢం ముగిసి మళ్లీ పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవ్వనుండగా.. తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం కొనేందుకు అప్పులు చేయకతప్పడం లేదని కొందరు వాపోతున్నారు.

తాజాగా బంగారం ధర మరోసారి పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1470 పెరిగి రూ. 1,58,620కు చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1350 పెరిగి రూ.1,45,400కి చేరింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1110 పెరిగి రూ.1,18,970గా ఉంది. ఈరోజు (శనివారం) వెండి ధర కాస్త శాంతించింది. కిలో వెండిపై కేవలం రూ.100 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ. 3,60,100గా ఉంది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. మున్ముందు పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నవారు బంగారం ఇప్పుడు కొనుగోలు చేయడమే మంచిదని, భవిష్యత్తులో ధర మరింత పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు.

Next Story