- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Price: మహిళామణులకు తీపికబురు.. మళ్లీ దిగొచ్చిన బంగారం ధర
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈ క్రమంలోనే వివాహాది శుభకార్యాలు పెట్టుకున్న వారికి ఇదే ఒక శుభ పరిణామమే.

దిశ, వెబ్‌డెస్క్: వివాహాలు, శుభకార్యాల సీజన్ మొదలైన వేళ బంగారం (Gold) ధరలు ఒక్కసారిగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ (International Market)లో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధరపై ఏకంగా రూ.1,530 తగ్గి రూ.1,54,910 వద్ద కొనసాగుతోంది. గడచిన రెండు రోజుల్లో రూ.2,840 మేర ధర తగ్గడం విశేషం. ఇక అభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై రూ.1,400 తగ్గి రూ.1,42,000కు చేరింది.
వెండి ధరలు ఢమాల్..
బంగారంతో పాటే వెండి (Silver) ధర కూడా భారీగా పతనమై కేజీ ధర రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5 వేల డాలర్ల మార్కు నుంచి 4,930 డాలర్ల స్థాయికి పడిపోవడంతో దేశీయంగా కూడా ధరలు దిగొచ్చాయి. దానికి తోడు డాలర్ విలువలో మార్పులు కూడా బులియన్ మార్కెట్‌పై ప్రభావం చూపాయి.






