Gold Price: మళ్లీ ఎగబాకిన పసిడి ధరలు.. కిలో వెండిపై రూ.5 వేలు పెరుగుదల

by Kema Shiva Kumar |

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా మళ్లీ పెరిగాయి

Gold Price: మళ్లీ ఎగబాకిన పసిడి ధరలు.. కిలో వెండిపై రూ.5 వేలు పెరుగుదల
X

దిశ, వెబ్‌డెస్క్: నిన్న కాస్త తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు, ఇవాళ బులియన్ మార్కెట్‌లో మళ్లీ పుంజుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో హైదరాబాద్‌లో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. ఈ మేరకు 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.1,470 పెరిగి రూ.1,53,930కు చేరింది. అదేవిధంగా ఆభరాణాల్లో ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,350 ఎగబాకి రూ.1,41,100 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు కేజీ వెండిపై ఒకేసారి రూ.5,000 పెరగడంతో కిలో వెండి ధర రూ.2,65,000కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాల్లో స్థానిక పన్నులు, రవాణా ఖర్చుల ఆధారంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story