- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold Price: బంగారం ధర ఆల్‌టైమ్ రికార్డ్.. 10 గ్రాములు @ రూ.1,78,850
గోల్డ్ లవర్స్‌కు ఊహించని షాక్ తగులుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగి, సరికొత్త ఆల్ టైమ్ రికార్డును సృష్టించాయి.

దిశ, వెబ్‌డెస్క్: గోల్డ్ లవర్స్‌కు ఊహించని షాక్ తగులుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డుకు చేరాయి. తాజాగా హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.11,770 పెరిగి రూ.1,78,850కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.10,800 ఎగబాకి రూ.1,63,950 పలుకుతోంది.
మరోవైపు కేజీ వెండి ధర రూ.4,25,000 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 5,500 డాలర్ల మార్కును దాటింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపడంతో బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి. ఇక భారత్‌లో పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ స్థాయిలో ధరలు పెరగడం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. కేవలం బంగారం ధర మాత్రమే కాకుండా అందుకు తోడు 3 శాతం జీఎస్టీ, మేకింగ్ చార్జెస్ అదనంగా బాదుతుండటంతో వినియోగదారులపై తీవ్ర భారం పడుతోంది.






