Gold Price పసిడి ప్రియులకు బిగ్ షాక్.. మరోసారి భారీగా పెరిగిన ధర

by Kema Shiva Kumar |

దేశవ్యాప్తంగా బంగారం (Gold) ధరలు మరోసారి పెరిగాయి.

Gold Price పసిడి ప్రియులకు బిగ్ షాక్.. మరోసారి భారీగా పెరిగిన ధర
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా బంగారం (Gold) ధరలు మరోసారి పెరిగాయి. నేడు జనవరి 11వ తేదీ శనివారం బంగారం, వెండి((Gold and silver rates) ధరలు పెరిగాయి. శుక్రవారంతో పోల్చితే శనివారం బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదు అయ్యింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 79, 630 ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 72, 860 పలుకుతోంది. (Gold and silver rates today)

ఢిల్లీలో 24క్యారెట్ల(24 carats) గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ. 79, 630 పలుకుతుండగా..22క్యారెట్ల(22 carats) గోల్డ్ రేట్ 10 గ్రాములకు రూ. 73,010కి చేరుకుంది. ఇక హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 79,480కి ఉండగా..22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,680కి చేరుకుంది. నేడు వెండి ధర మాత్రం పెరిగింది. ఈ క్రమంలో బంగారం ధరలు(Gold rates) ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకుందాం.

బంగారం ధరలు వరుసగా పెరగడానికి ప్రధాన కారణం అంతర్జాతీయంగా మార్కెట్లో నెలకొంటున్న పరిస్థితులతోపాటు అమ్మకాల ఒత్తిడి అని చెప్పవచ్చు. ముఖ్యంగా అమెరికా స్టాక్ మార్కెట్లో(US stock market) పెద్దెత్తున నష్టాలు నమోదు అవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మళ్లిస్తున్నారు. బంగారం ధర అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్సు ధర 2720డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు అమెరికాలో ధర 30 డాలర్లు పెరిగింది. ఈ ప్రభావం మన దేశంపై కూడా కనిపిస్తోంది.

బంగారం ధరలు పెరగడానికి మరో ప్రధాన కారణం..జనవరి చివరి వారంలో అమెరికా అధ్యక్ష బాధ్యతలను డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చేపట్టనున్నారు. ఈనేపథ్యంలో తన వ్యాపార విధానాలను ఖరాఖండిగా చెబుతుండటంతో మార్కెట్లలో ఆందోళన నెలకుంటుంది. ఇది కూడా బంగారం ధరలు పెరిగడానికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు. భవిష్యత్తులో బంగారం ధర 80వేలు దాటుతుందని బులియన్ మార్కెట్ల్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story