- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: ఆగని పసిడి రికార్డులు.. తులం రూ. రూ.1.26 లక్షలు
దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ. 1.24 లక్షలకు చేరుకుంది.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు వరుసగా కొత్త రికార్డులను నమోదు చేస్తూ సామాన్యులకు షాక్‌కు గురిచేస్తున్నాయి. గడిచిన నెల రోజులుగా పసిడి రోజుకొక కొత్త గరిష్ఠాలను అధిగమిస్తున్నాయి. తాజాగా బుధవారం కూడా బంగారం ధరలు సరికొత్త మార్కుకు చేరాయి. దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన బంగారం పది గ్రాములు రూ. 1.24 లక్షలకు చేరుకుంది. దీనికి ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, అమెరికా ఫెడరల్ ప్రభుత్వం షట్‌డౌన్ వంటి పరిణామాల మధ్య పెట్టుబడిదారులు బంగారంలో మరింత పెట్టుబడికి సిద్ధమవడంతో ధరలు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్లలోనూ ఔన్స్ బంగారం తొలిసారిగా 4,000 డాలర్లను దాటి బుధవారం సాయంత్రానికి 4,064.80 డాలర్ల వద్ద ఉంది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ధర రూ. 1,910 పెరిగి రూ.1,26,793 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాములు రూ. 1,750 పెరిగి రూ.1,16,227 పలుకుతోంది. అటు వెండి సైతం కిలో రూ.1.70 లక్షలు చేరుకంది. గ్లోబల్ మార్కెట్లో వెండి ఔన్సు 49.32 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ 88.75గా ఉంది.






