- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold Rate: బంగారం ధరల్లో కొత్త రికార్డులు
అమెరికా టారిఫ్‌లతో పాటు భౌగోళిక రాజకీయ పరిణామాలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఆజ్యం పోస్తున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు అలుపులేకుండా దూసుకెళ్తున్నాయి. ఇప్పటికే ఊహించని రికార్డు స్థాయికి చేరిన పసిడి, తాజాగా సరికొత్త గరిష్ఠాలకు చేరింది. అమెరికా టారిఫ్‌లతో పాటు భౌగోళిక రాజకీయ పరిణామాలు, సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు ఆజ్యం పోస్తున్నాయి. వీటితో పాటు తాజాగా అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్ కారణంగా బంగారం ధరలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా దేశీయ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం ధర పది గ్రాములు రూ. 1,20,920 వద్ద ఉంది. అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌లో ఉండటం, ఫెడ్ రేట్ల కోతలపై పెరుగుతున్న అంచనాల కారణంగా చాలామంది సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పసిడికి గిరాకీ ఊపందుకుంది. సోమవారం మధ్యాహ్నం సమయానికి హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,370 పెరిగి రూ. 1,23,384 వద్ద ఉంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 1,250 పెరిగి రూ. 1,13,102 వద్ద ఉంది. మరోవైపు వెండి కూడా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. సోమవారం కిలో వెండి రూ. 1,000 పెరిగి రూ. 1.66 లక్షలకు చేరుకుంది. గడిచిన వారం రోజుల్లో బంగారం ధరలు రూ. 3 వేలకు పైగా పెరిగింది. వెండి వారం రోజుల్లోనే సుమారు రూ. 4 వేలు పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లను గమనిస్తే, ఔన్స్ బంగారం(31.10 గ్రాములు) 3,935 డాలర్లుగా ఉంది.






