Todays Gold Rate :ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు పసిడి

by S Gopi |   (  Updated:2025-06-13 12:44:08  IST  )

మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారంవైపు మొగ్గుచూపారు

Todays Gold Rate :ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలకు పసిడి
X

దిశ, బిజినెస్ బ్యూరో: బంగారం ధరలు మరోసారి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరాయి. శుక్రవారం వరుసగా మూడోరోజు పది గ్రాములు రూ. 2,120 పెరిగిన పసిడి కొత్త గరిష్ఠం రూ. 1,01,400కి చేరుకుంది. ముఖ్యంగా భారత కరెన్సీ రూపాయి బలహీనపడటం, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారంవైపు మొగ్గుచూపారు. వీటితో పాటు శుక్రవారం అంతర్జాతీయంగా చమురు ధరలు భగ్గుమన్నాయి. ఇరాన్ అణు కేంద్రాలపై ఇజ్రాయెల్ డాడి చేయడంతో పరిస్థితులు అత్యంత ప్రతికూలంగా మారిపోయాయి. రానున్న రోజుల్లో అమెరికా ఫెడ్ తన పాలసీ వైఖరిని సడలిస్తుందనే అంచనాలు కూడా పసిడిపై ప్రభావం చూపాయి. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరిగిన గొడవలతో సురక్షిత పెట్టుబడిగా బంగారానికి విపరీతమైన గిరాకీ ఏర్పడింది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో చెలరేగిన ఉద్రిక్తతల ఫలితంగా అమెరికా కరెన్సీ డాలర్ బలపడింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం రూ. 1,00,403గా ఉంది. ఆభరణాల తయారీ వినియోగించే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 1,950 పెరిగి రూ. 92,950 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లలో బంగారం ఫ్యూచర్స్ ఔన్స్‌కు 1.22 శాతం పెరిగి ఆరు వారాల గరిష్టం 3,444 డార్లకు చేరుకుంది.

Next Story