Gold ETFs: గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి ఆరు రెట్లు పెరిగిన పెట్టుబడులు

by S Gopi |

ముఖ్యంగా బంగారం ధరలు ఊహించని విధంగా రికార్డు గరిస్ఠాలకు చేరడంతో చిన్న మొత్తం గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెట్‌ ఫండ్ల (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) కొనుగోళ్లు అత్యంత వేగంగా పెరిగాయి.

Gold ETFs: గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి ఆరు రెట్లు పెరిగిన పెట్టుబడులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: పసిడి ధరలతో పాటు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు సంప్రదాయ 'సురక్షిత ఆస్తి' బంగారంలో పెట్టుబడులకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే 2026, మార్చి త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడులు ఏకంగా 6 రెట్లు పెరగడమే దీనికి సాక్ష్యం. ముఖ్యంగా బంగారం ధరలు ఊహించని విధంగా రికార్డు గరిస్ఠాలకు చేరడంతో చిన్న మొత్తం గోల్డ్‌ ఎక్స్ఛేంజ్‌ ట్రేడెట్‌ ఫండ్ల (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) కొనుగోళ్లు అత్యంత వేగంగా పెరిగాయి. మార్చితో ముగిసిన త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి మొత్తం రూ. 31,561 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇది గతేడాది మార్చి త్రైమాసికంలో వచ్చిన రూ. 5,654 కోట్ల కంటే దాదాపు ఆరు రెట్లు అధికం. త్రైమాసిక పరంగా కూడా అంతకుముందు డిసెంబర్ త్రైమాసికంలో రూ. 23,132 కోట్ల కంటే 36 శాతం పెరిగాయని అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ (యాంఫీ) పేర్కొంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి పెట్టుబడులు పెరగడంతో గోల్డ్ ఫండ్ల ఆస్తులు గతేడాది రూ. 58,888 కోట్ల నుంచి మూడు రెట్లు పెరిగి రూ. 1.71 లక్షల కోట్లకు చేరింది.

Next Story