- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: వరుస నాలుగు రోజుల తర్వాత రూ.1,700 తగ్గిన బంగారం
ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో వరుస నాలుగు రోజుల రికార్డు ర్యాలీ తర్వాత క్షీణించాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: హద్దుల్లేకుండా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ సంకేతాలు బలహీనంగా ఉండటం, చాలామంది ఇన్వెస్టర్లు బంగారంలో పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో మంగళవారం వరుస నాలుగు రోజుల రికార్డు ర్యాలీ తర్వాత క్షీణించాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధానిలో మంగళవారం బంగారం ధరలు రూ. 1,700 తగ్గి పది గ్రాములకు రూ. 1,35,900కి చేరాయి. హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ. 1,520 క్షీణించి రూ. 1,33,950కి పడిపోయాయి. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 1,400 తగ్గి రూ. 1,22,700కి చేరాయి. గడిచిన ఐదు రోజుల వ్యవధిలో బంగారం రూ. 6 వేల వరకు పెరిగింది. బంగారం ధరలు లాభాల స్వీకరణ దశకు చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధర 4,275 డాలర్ల స్థాయికి పడిపోయి ఒత్తిడికి గురైందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్, కమోడిటీ అండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్ జతీన్ త్రివేది అన్నారు. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. స్థానిక బులియన్ మార్కెట్లో మంగళవారం వెండి కిలో రూ. 4,000 తగ్గి రూ. 2,11,000కి(అన్ని పన్నులతో కలిపి) చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలోనూ స్పాట్ గోల్డ్ ఐదు రోజుల వరుస లాభాల పరంపరకు తెరదించి, 27.80 డాలర్లు క్షీణించింది. ప్రస్తుతం ఔన్సు ధర 4,277.42 డాలర్లకు చేరింది.






