- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Gold: రూ. వెయ్యి తగ్గిన బంగారం
అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడింది

దిశ, బిజినెస్ బ్యూరో: గతవారం వరకు కొత్త కొత్త రికార్డు గరిష్ఠాలకు చేరిన బంగారం ధరలు తగ్గుతున్నాయి. సోమవారం అంతర్జాతీయంగా బలహీన ధోరణి కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 1,000 తగ్గి రూ. 98,400కి చేరుకుంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పసిడి రూ. 99,400 వద్ద ఉంది. 99.5 స్వచ్ఛత కలిగిన బంగారం 10 గ్రాములు రూ. 1,000 క్షీణించి రూ. 97,900కి చేరింది. అమెరికా-చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో పెట్టుబడిదారుల్లో సెంటిమెంట్ బలపడింది, ఇదే సమయంలో బులియన్ మార్కెట్ వంటి సురక్షితమైన సాధనాల్లో పెట్టుబడులకు డిమాండ్ తగ్గడం, అమెరికా డాలర్ విలువ బలహీనపడటం వంటి అంశాలు బంగారం ధరలపై ఒత్తిడి పెంచాయని అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సీఈఓ చింతన్ మెహతా చెప్పారు. గతవారాంతమే కొన్ని యూఎస్ దిగుమతులను 125 శాతం సుంకాల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు చైనా ప్రకటించింది. కానీ, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ వాతావరణం, వాణిజ్యంలో కొత్త వివాదాల వల్ల పెట్టుబడిదారులు తిరిగి బంగారంలో పెట్టుబడులకు మొగ్గు చూపవచ్చు. ఫలితంగా మళ్లీ ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదని చింతన్ మెహతా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్, పాక్ మధ్య పెరిగిన ఘర్షణ కూడా బంగారానికి డిమాండ్ పెంచవచ్చని చెప్పారు. వెండి ధరలు కూడా సోమవారం రూ. 1,400 తగ్గి రూ. 98,500కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లోనూ స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1 శాతం క్షీణించి 3,291 డాలర్లకు చేరింది.






