- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Gold: రూ. 1.13 లక్షలు మార్కు చేరిన బంగారం
దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు పసిడి 43.25 శాతం పెరిగింది.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు రోజుకొక కొత్త రికార్డు గరిష్ఠానికి చేరుతోంది. గత రెండు రోజుల నుంచి స్థిరంగా కనిపించిన పసిడి ధరలు గురువారం మరో రికార్డు ఆల్‌టైమ్ హైకి చేరాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం రూ. 1,13,100 వద్ద ఉన్నాయి. ముఖ్యంగా స్టాకిస్టులు కొనుగోళ్లను కొనసాగించడం వల్లనే ఈ పెరుగుదల కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాదిలో ఇప్పటివరకు పసిడి 43.25 శాతం పెరిగింది. 2024, డిసెంబర్ 31న పది గ్రాములు రూ. 78,950 ఉంది. అంటే, ఎనిమిది నెలల కాలంలో బంగారం తులం రూ. 34,150 పెరిగింది. గురువారం హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం రూ. 1,13,100(అన్ని పన్నులు కలిపి) కొత్త రికార్డు స్థాయికి చేరింది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాములు రూ. 1,01,300 వద్ద ఉంది. వెండి కిలో రూ. 1.40 లక్షల వద్ద ఉంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితితో పాటు డాలర్ కరెన్సీ బలహీనపడటం, సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు కొనసాగడం వంటి అంశాల కారణంగా పెట్టుబడిదారుల నుంచి సురక్షిత సాధనమైన బంగారానికి డిమాండ్ భారీగా పెరిగిందని నిపుణులు పేర్కొన్నారు.






