- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళలకు భారీ గుడ్‌న్యూస్.. అమాంతం పడిపోయిన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. మూడ్రోజులుగా భారీగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పతనమయ్యాయి. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వీటి ధరలు మూడ్రోజులుగా భారీగా తగ్గుతుండటంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొద్దిరోజుల్లో శుక్రమౌఢ్యమి ముగిసి పెళ్లిళ్ల సీజన్ కూడా మొదలు కానున్న సమయంలో బంగారం ధరలు దిగివస్తుండటం విశేషం. సోమవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.9050 తగ్గి రూ.1,51,530కి దిగివచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.8300 తగ్గి రూ.1,38,900కి తగ్గింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.6790తగ్గి రూ.1,13,650కి పడిపోయింది. జనవరి 30 నుంచి నేటి వరకూ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.27,320 మేర తగ్గగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.25,050 వరకూ తగ్గింది.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. జనవరి 29న కేజీ వెండి ధర రూ.25000 పెరిగి రూ.4,25,000 చేరగా.. ఉన్నట్లుండి మార్కెట్లు కుదేలయ్యాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ తీసుకోవడంతో బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. నేడు కిలో వెండి ధరపై ఏకంగా రూ.20,000 తగ్గగా.. ప్రస్తుతం ధర రూ.3,00,000లుగా ఉంది. నాలుగు రోజుల్లో వెండి ధర రూ.1,25,000 తగ్గడం కొత్త ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేస్తోంది. కానీ ఇదంతా టెంపరరీనే అని, బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలొస్తాయని నిపుణులు చెప్తున్నారు. సో పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి ఛాన్స్ అని చెప్పాలి.






