మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. తులం ఎంతంటే?

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-19 08:13:50  IST  )

గ‌త కొద్దిరోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రోసారి షాక్ ఇచ్చాయి. ఒక్క‌సారిగా ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి. హైద‌రాబాద్ లో తులం బంగారంపై ఒక్క‌రోజులో రూ.3,470 పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.9,700 పెరిగింది.

మ‌ళ్లీ పెరిగిన బంగారం, వెండి ధ‌ర‌లు.. తులం ఎంతంటే?
X

దిశ‌, వెబ్ డెస్క్: గ‌త కొద్దిరోజులుగా త‌గ్గుతూ వ‌స్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు మ‌రోసారి షాక్ ఇచ్చాయి. ఒక్క‌సారిగా ధ‌ర‌లు అమాంతం పెరిగిపోయాయి. హైద‌రాబాద్ లో తులం బంగారంపై ఒక్క‌రోజులో రూ.3,470 పెరిగింది. కిలో వెండిపై ఏకంగా రూ.9,700 పెరిగింది. దీంతో ప్ర‌స్తుతం మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధ‌ర రూ.1,60,570గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.1,47,000కు చేరింది. హైద‌రాబాద్ లో కిలో వెండి ధ‌ర రూ.2,58,000ల‌కు చేరుకుంది. ఇక బుధ‌వారం నుండి మ‌ళ్లీ పెళ్లిళ్ళ సీజ‌న్ మొద‌లైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బంగారం ధ‌ర‌లు మ‌రోసారి పెర‌గ‌టంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు.

Next Story