BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర.. రూ.2 లక్షలకు చేరువలో వెండి

by Naga Rani Yarlagadda |

శనివారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. లక్ష ముప్పై వేలకు చేరువలో ఉండగా.. వెండి ధర..

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధర.. రూ.2 లక్షలకు చేరువలో వెండి
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి నగలు, వస్తువులు కొనాలన్న సామాన్యుల ఆశ.. ఆశగానే మిగిలిపోనుందా? అంటే అవునన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా పెరుగుతున్న ధరలు చూస్తుంటే బంగారంతో పాటు వెండి కూడా అందని ద్రాక్షగా మారుతుందన్న ఆందోళన పెరుగుతోంది. శనివారం ఉదయం 10 గంటలకు బులియన్ మార్కెట్లో ఉన్న రేట్ల ఆధారంగా చూస్తే.. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 1360 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1250 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,29,820కి చేరగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,19,000కి పెరిగింది.

భారీగా పెరిగిన వెండి ధర

బంగారం ధరలతో పాటు వెండి ధర కూడా కోలుకోలేని షాకిస్తోంది. శనివారం ఒక్కరోజే కిలో వెండి ధర ఏకంగా రూ.9000 పెరిగింది. దీంతో హైదరాబాద్ లో కిలో వెండి ధర రూ.1,92,000కు చేరింది. త్వరలోనే వెండి ధర రూ.2 లక్షలు దాటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Next Story