భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

by Muthe.Rajitha |   (  Updated:2026-02-13 04:22:41  IST  )

బంగారం, వెండి ధరలు మరోసారి దూసుకువెళ్లాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర ఒక్క రోజులోనే రూ.1,200 పెరిగి రూ.1,41,220కు చేరగా, 22 క్యారెట్ బంగారం రూ.1,100 పెరిగి రూ.1,29,450గా నమోదైంది.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు
X

దిశ, వెబ్ డెస్క్ : బంగారం, వెండి ధరలు మరోసారి దూసుకువెళ్లాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర ఒక్క రోజులోనే రూ.1,200 పెరిగి రూ.1,41,220కు చేరగా, 22 క్యారెట్ బంగారం రూ.1,100 పెరిగి రూ.1,29,450గా నమోదైంది. అదే సమయంలో వెండి ధరలు మరింత వేగంగా పెరిగి.. కిలో వెండి ఒక్క రోజులో రూ.20,000 పెరిగి రూ.2,74,000కు చేరి మరో ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం $2,700కు పైగా, వెండి $32కు పైగా ట్రేడ్ అవుతున్నాయి. డాలర్ బలహీనత, భౌగోళిక రాజకీయక ఉద్రిక్తతలు, సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ డిమాండ్ పెరగడం వంటి కారణాల వల్ల ఈ ధరల పెరుగుదల కొనసాగుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ నెలలోనే వెండి భారీగా పెరగగా, బంగారం కూడా రికార్డు స్థాయుల్లోఆకాశాన్ని తాకింది.

Next Story