- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఒక్కరోజే రూ.10 వేలు పతనం
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఎన్నడూ లేని విధంగా బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్: గోల్డ్ లవర్స్‌కు భారీ ఊరట లభించింది. గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఒక్కసారిగా కిందికి దిగివచ్చాయి. ఈ మేరకు ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్ (Hyderabad Bullion Market)లో నేడు 24 క్యారెట్ల స్వచ్ఛమైన మేలిమి బంగారం ధర 10 గ్రాములపై రూ.1,090 తగ్గింది. దీంతో ప్రస్తుతం ధర రూ.1,62,220 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, సాధారణంగా ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పడిపోయింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.1,000 తగ్గి, ప్రస్తుతం రూ.1,48,700 వద్ద ట్రేడ్ అవుతోంది.
వెండి ధర ఢమాల్...
బంగారం కంటే వెండి ధరలో భారీ మార్పు కనిపించింది. కేజీ వెండిపై ఏకంగా రూ.10 వేల మేర ధర తగ్గడం విశేషం. దీంతో మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 2,90,000 కి చేరింది. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ వంటి ప్రాంతాల్లో కూడా ఇవే ధరలు దాదాపుగా అమల్లో ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, రూపాయి విలువలో మార్పుల కారణంగానే బంగారం, వెండి ధరలు భారీగా తగ్గినట్లుగా మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.






