- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తగ్గని పసిడి ధగధగలు.. భారీగా పెరిగిన వెండి
బంగారం ధరలు పసిడి ప్రియులకు ఏమాత్రం ఊరటనివ్వడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బంగారం ధరలు పసిడి ప్రియులకు ఏమాత్రం ఊరటనివ్వడం లేదు. కొద్ది నెలలుగా 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు పైగానే కొనసాగుతోంది. నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధర నేడు నిన్నటికి ఆరింతలు పెరిగింది. శుక్రవారం ఉదయం 10 గంటలకు బులియన్ మార్కెట్లో ఉన్న రేట్ల ఆధారంగా చూస్తే.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 710 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.650 పెరిగింది. దీంతో ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,28,460కి చేరగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,17,750కి పెరిగింది.
4 రోజుల్లో రూ.12 వేలు
వెండి ధరల విషయానికొస్తే నవంబర్ 25 నుంచి నేటి వరకూ.. అంటే నాలుగు రోజుల్లో కిలో వెండి ధర ఏకంగా రూ.12 వేలు పెరిగింది. శుక్రవారం కిలో వెండి ధర రూ.3000 పెరిగి రూ.1,83,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం, వెండితో పాటు ప్లాటినం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల ప్లాటినం ధరపై నిన్న రూ.1740 పెరగ్గా.. నేడు రూ.980 పెరిగింది. దీంతో ప్రస్తుతం 10 గ్రాముల ప్లాటినం ధర రూ.47,200గా ఉంది. ప్రస్తుతం శుక్రమౌఢ్యమి ఉండగా.. పెళ్లిళ్లకు అన్ సీజన్ నడుస్తోంది. ఇప్పుడైనా బంగారం ధరలు తగ్గుతాయనుకుంటే అంచనాలకు భిన్నంగా పెరుగుతుండటంతో పసిడి ప్రియులు నిరాశ చెందుతున్నారు.






