తారాజువ్వలా దూసుకెళ్తున్న వెండి.. పట్టీలు కొనాలన్నా భారమేనా?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-01-13 09:18:02  IST  )

మంగళవారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.1,42,530కి చేరింది.

తారాజువ్వలా దూసుకెళ్తున్న వెండి.. పట్టీలు కొనాలన్నా భారమేనా?
X

దిశ, వెబ్‌డెస్క్: బంగారం, వెండి ధరలు రోజు రోజుకూ పైపైకి పెరుగుతున్నాయే తప్ప.. తగ్గడం లేదు. అప్పుడప్పుడూ మెరుపుతీగలా స్వల్పంగా తగ్గినా.. అంతకు మూడు నాలుగింతల ధర పెరుగుతోంది. సంక్రాంతి పండుగ వేళ బంగారం, వెండి ధరలు మరింత పెరుగుతుండటం కొనుగోలుదారులకు షాకిస్తోంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, డిమాండ్ అండ్ సప్లై, డాలర్ వద్ద రూపాయి బలహీన పడటం, అంతర్జాతీయ ఉద్రిక్తతలు, సౌర విద్యుత్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి వెండి డిమాండ్ ఉండటం ఇలా రకరకాల కారణాల వల్ల వెండి, బంగారం ధరలు పెరుగుతున్నాయి.

మంగళవారం కూడా బంగారం, వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.1,42,530కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.350 పెరిగి రూ.1,30,650కి వెళ్లింది. వెండి ధర మరోసారి భారీగా పెరిగింది. కిలో వెండి ధర రూ.5000 పెరగడంతో రూ.2,92,000కు చేరింది. ఈ లెక్కప్రకారం.. 10 తులాల వెండి పట్టీలు కొనాలంటే రూ.30,000 నుంచి రూ.35,000 వరకూ ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ ధర 2019లో 10 గ్రాముల బంగారం ధరకు సమానం. మున్ముందు వెండి రూ.3,00,000 మార్క్ ను క్రాస్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ ఏడాది చివరి నాటికి వెండి రూ.5,00,000 మార్క్ ను టచ్ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

READ MORE ....

Silver: కొత్త గరిష్ఠాలకు బంగారం, వెండి ధరలు

Next Story