- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాకిచ్చిన బంగారం, వెండి ధరలు.. రూ.10 వేల నుంచి రూ.30 వేల మేర జంప్
బంగారం, వెండి ధరలు తగ్గుతాయని ఎదురుచూసేవారికి ఇది షాక్ అని చెప్పాలి. ఈరోజు ధరలు ఊహించని రీతిలో పెరిగాయి.

దిశ, వెబ్‌డెస్క్: పెళ్లిళ్లు, శుభకార్యాలకు ముహూర్తాలు మొదలైంది మొదలు.. బంగారం ధరలు కంటిన్యూగా పెరుగుతున్నాయి. గడిచిన 10 రోజుల్లో ఒకే ఒక్కసారి మాత్రమే ధరలు తగ్గాయి. శనివారం బంగారం, వెండి ధరలు కొనుగోలు దారులకు ఊహించని షాకిచ్చాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,160 పెరిగి రూ.1,64,730కి జంప్ అయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2900 పెరిగి రూ.1,51,000కు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా భారీగా పెరగడం గమనార్హం. 10 గ్రాముల ధర రూ.2370 పెరిగి రూ.1,23,550కి పెరిగింది. ఈ నెల 19వ తేదీ నుంచి నేటి వరకూ 10 గ్రాముల బంగారం ధర రూ.10,530 నుంచి రూ.9650 మేర పెరగడంతో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనుగోలు చేసేవారికి భారమేనని చెప్పాలి.
వెండి విషయానికొస్తే.. 10 రోజులుగా రూ.3,00,000 వద్ద ఊగిసలాడుతోంది. ఈనెల 19న కిలో వెండి ధర రూ.2,70,000 ఉండగా.. నేడు ఈ ధర రూ.3,00,000కు చేరింది. శనివారం కిలో వెండిపై రూ.5000 పెరిగింది. మున్ముందు బంగారం, వెండి ధరల పెరుగుదలపై అంచనాలు వేయడం కష్టంగా మారుతోందని, ఇన్వెస్టర్లు ఎప్పుడు ఎలా నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదని మార్కెట్ల నిపుణులు చెప్తున్నారు. సో.. ఈ లోహాలతో చేసిన ఆభరణాలు కొనుగోలు చేసేవారు ధరలు ఇంకా తగ్గుతాయని ఎదురుచూడకుండా ఇప్పుడు కొనడం బెటరంటున్నారు.






