- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొనుగోలుదారులకు సూపర్ న్యూస్.. బంగారం, వెండి ధరలు పతనం
ప్రపంచ దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం బంగారం,వెండి ధరలపై పడుతోంది. వరుసగా మూడోరోజు ధరలు భారీగా పతనమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: మూడురోజుల క్రితం వరకూ భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు దిగి వస్తోంది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాల కోసం బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూసేవారికి ఇదే మంచి సమయమని చెప్పాలి. వరుసగా మూడ్రోజుల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.8580 నుంచి రూ.7850 వరకూ తగ్గింది. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధపరిస్థితుల ప్రభావంతోనే ధరలు తగ్గుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. మరోవైపు రూపాయి మారకం విలువ డాలర్ తో పోలిస్తే మరో 67 పైసలు పతనమైంది. దీనివల్ల కూడా బంగారం, వెండి ధరలు తగ్గినట్లుగా విశ్లేషిస్తున్నారు.
మార్చి 4 (బుధవారం) బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3110 తగ్గి రూ.1,64,510కి దిగివచ్చింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2850 తగ్గి.. రూ.1,50,800కి తగ్గింది. వెండి ధర కూడా భారీగా పతనమైంది. జనవరి నెలలో ఏకంగా 60 శాతం పెరిగి కిలో వెండి ధర రూ.4,00,000 మార్కును అందుకోగా.. ఫిబ్రవరి నుంచి వెండి ధరలు తగ్గుతూ వచ్చాయి. కొద్దిరోజులుగా ధర రూ.2,70,000 నుంచి రూ.3,00,000 మధ్య ఊగిసలాడుతోంది. బుధవారం కిలో వెండిపై రూ.20,000 తగ్గడంతో ధర రూ.2,95,000కు పతనమైంది.






