దేశంలో తొలి ఏఐ ఆధారిత తెలుగు క్రిప్టో ఫ్యూచర్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-10 12:10:40  IST  )

దేశంలో మూడవ అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన జియోటస్.. తొలి ఏఐ ఆధారిత క్రిప్టో ఫ్యూచర్స్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్ ను ప్రారంభించింది.

దేశంలో తొలి ఏఐ ఆధారిత తెలుగు క్రిప్టో ఫ్యూచర్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్‌
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మూడవ అతిపెద్ద క్రిప్టో ఎక్స్చేంజ్ అయిన జియోటస్.. తొలి ఏఐ ఆధారిత క్రిప్టో ఫ్యూచర్స్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్ ను ప్రారంభించింది. 13 లక్షల మంది యూజర్లతో ఏకైక వెర్నాక్యులర్ క్రిప్టో ఫ్యూచర్స్ ఎడ్యుకేషన్ ప్లాట్ ఫారమ్ అయిన జియోటస్ ఈ అకాడమీని ఉచితంగా అందిస్తోంది. క్రిప్టో గురించి అందరినీ ఎడ్యుకేట్ చేయడమే ఈ అకాడమీ ముఖ్య ఉద్దేశం. ఇంగ్లీష్ సహా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ వంటి లాంగ్వేజ్ మాడ్యూల్స్, లైవ్ సెషన్స్ ఇందులో ఉంటాయి. అగ్రశ్రేణి ట్రేడర్లు, విశ్లేషకులు కలిసి డిజైన్ చేసిన ఈ జియోటస్ అకాడమీ, యాక్షన్ బేస్డ్ లెర్నింగ్, రియల్ టైమ్ ట్రేడింగ్ ఎక్స్ పీరియన్స్ తో కంబైన్ చేసి ఉంటుంది. దీని వల్ల క్రిప్టోలో ప్రతి విషయం ఈజీగా అర్థమవుతుంది.

క్రిప్టో ఫ్యూచర్స్ లెర్నింగ్ ప్లాట్ ఫారమ్ లో రిజిస్ట్రేషన్లు, కేవైసీ, అడ్వాన్స్డ్ ట్రేడింగ్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అన్ని విషయాలు నేర్పిస్తారు. విశ్లేషణ చార్టులు, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ గైడెన్స్, ఏఐ ఆధారిత ట్రేడింగ్ సిగ్నల్స్, వ్యూహాత్మక సూచనలను కూడా ఇది అందిస్తుంది. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా, సురక్షితంగా, ధైర్యంగా ముందుకు వెళ్లేందుకు ఈ కార్యక్రమం ప్రోత్సాహాన్నిస్తుంది. జియోటస్ సీఈఓ అండ్ కో ఫౌండర్ విక్రమ్ సుబ్బురాజ్ మాట్లాడుతూ.. మీ మాతృభాషలో నేర్చుకుని ట్రేడ్ చేయండి, సంపాదించండి అని సూచించారు. దేశంలో ప్రతి పౌరుడికి భాష, భౌగోళిక పరిమితి లేకుండా ఆర్థిక అవకాశాలను అందించడమే జియోటస్ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ అకాడమీలో ఉచితంగా చేరాలనుకున్నవారు https://giottusacademy.com/sessions లింక్ ను ఓపెన్ చేసి పొందవచ్చని తెలిపారు.

Next Story