- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Adani: గౌతమ్ అదానీ జీతం రూ. 10.41 కోట్లే
తొమ్మిది లిస్టెడ్ కంపెనీలలో రెండింటి నుంచి జీతాలు పొందారని గ్రూప్ లిస్టెడ్ కంపెనీల వార్షిక నివేదికలు పేర్కొన్నాయి

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో రెండవ అత్యంత ధనవంతుడైన గౌతమ్ అదానీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 10.41 కోట్ల జీతం తీసుకున్నారు. ఇది చాలామంది ఆయన తోటీ పారిశ్రామికవేత్తలు, అదానీ గ్రూప్ కంపెనీల్లోని కీలక ఎగ్జిక్యూటివ్‌ల కన్నా తక్కువ కావడం గమనార్హం. అదానీ తన తొమ్మిది లిస్టెడ్ కంపెనీలలో రెండింటి నుంచి జీతాలు పొందారని గ్రూప్ లిస్టెడ్ కంపెనీల వార్షిక నివేదికలు పేర్కొన్నాయి. అలాగే, మునుపటి 2023-24 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రూ. 9.26 కోట్ల కంటే 12 శాతం ఎక్కువ. కంపెనీల వివరాల ప్రకారం, అదానీ ఎంటర్‌ప్రైజెస్ నుంచి గౌతమ్ అదానీ రూ. 2.26 కోట్లు తీసుకున్నారు. దీంతో పాటు అదనంగా అలవెన్సులు, ఇతర ప్రయోజనాల రూపంలో మరో రూ. 28 లక్షలు అందుకున్నారు. అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్ నుంచి రూ. 1.8 కోట్లను వేతనం రూపంలో, లాభాల్లో వాటా కింద రూ. 6.07 కోట్లను పొందారు. గౌతమ్ అదానీ జీతం దేశంలో గ్రూప్ అధినేతల కంటే చాలా తక్కువ. అతిపెద్ద ప్రైవేట్ రంగ సంస్థ రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ రూ. 15 కోట్లు ఉండేది. కొవిడ్-19 మహమ్మారి తర్వాత ఆయన జీతం తీసుకోవడం మానేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రకారం, భారతీ ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ రూ. 32.27 కోట్లు, రాజీవ్ బజాజ్ రూ. 53.75 కోట్లు, పవన్ ముంజాల్ రూ. 109 కోట్లు, 2024-25 ప్రకారం, ఎల్అండ్‌టీ ఛైర్మన్ ఎస్ ఎస్ సుబ్రమణ్యం రూ. 76.25 కోట్లు, ఇన్ఫోసిస్ సీఈఓ రూ. 80.62 కోట్ల వేతనాలను తీసుకుంటున్నారు. ఇక, అదానీ గ్రూప్ కంపెనీల్లోని ఎగ్జిక్యూటివ్‌లు కూడా గౌతమ్ అదానీ కంటే ఎక్కువ వేతనం పొందుతున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ సీఈఓ వినయ్ ప్రకాశ్ రూ. 69.34 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీ సీఈఓ వినీత్ జైన్ రూ. 11.23 కోట్లు తీసుకుంటున్నారు.






