April -4: తెలుగు రాష్ట్రాల్లో నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే.?

by Kodari Anjali |   (  Updated:2025-04-04 02:12:20  IST  )

ఏప్రిల్ 1 వ తారీకున గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

April -4: తెలుగు రాష్ట్రాల్లో నేడు గ్యాస్ సిలిండర్ ధరలు ఇవే.?
X

దిశ, వెబ్‌డెస్క్: ఏప్రిల్ 1 వ తారీకున గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. కమర్షియల్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేటును ఏకంగా 41 రూపాయలు తగ్గించాయి ఆయిల్ కంపెనీలు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ప్రతి నెల ఒకటో తారీకున ఆయిల్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో చూసినట్లైతే.. ఢిల్లీలో రూ.1762 రూపాయలకు చేరింద. అయితే డొమెస్టిక్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. దీంతో సామాన్యులకు కాస్త ఊరట లభించింది. మారిన ధరల ప్రకారం చూసినట్లైతే.. హైదరబాదు‌లో కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ. 1985 గా ఉంది. ఇక చెన్నై లో 19 కేజీల సిలిండర్ రూ. 1921 ఉంది. కోల్కతాలో 1868 రూపాయలు ఉండగా.. ముంబైలో 1713 రూపాయలుగా కమర్షియల్ సిలిండర్ ధర ఉంది. ఇక 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధర రూ. 855 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. దాదాపు అన్ని నగరాల్లో రాయితీ సిలిండర్ ధరలు స్థిరంగానే ఉన్నాయి.


Also Read..

ఏప్రిల్-4 : తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

Next Story