LPG Gas Price(March 22): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు

by Jakkula.Mamatha |

ఇవాళ(మార్చి 22) రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

LPG Gas Price(March 22): తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ సిలిండర్ ధరలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరలు అంతర్జాతీయ ముడి చమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. రీసెంట్‌గా గ్యాస్ ధరలు సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ ఉద్రిక్తతల (ఇరాన్-ఇజ్రాయెల్ వివాదం) కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశీయ వంట గ్యాస్(LPG) సిలిండర్ ధరలను రూ. 60 పెంచాయి. ఈ పెంపుతో హైదరాబాద్‌లో 14.2 కిలోల సిలిండర్ ధర సుమారు రూ. 965కు చేరుకుంది. వాణిజ్య సిలిండర్‌పై రూ. 115 పెరిగింది. దీంతో కొన్ని హోటల్స్ మూసి వేసుకునే పరిస్థితి నెలకొంది. ఇతర నగరాలతో పోల్చి చూస్తే వరంగల్‌లోనే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ(మార్చి 22) హైదరాబాద్, విజయవాడలో గ్యాస్ సిలిండర్ ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.

ఈ రోజు గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ. 965

వరంగల్: రూ. 984.00

విశాఖపట్నం: రూ. 921.00

విజయవాడ: రూ. 937.50

గుంటూరు: రూ. 937.50

Next Story