- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Housing Market: కాస్ట్లీగా మారుతున్న ఇళ్లు
తక్కువ సంఖ్యలో ఇళ్ల అమ్మకాలే ఎక్కువ విలువను సృష్టిస్తున్నాయి.

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ హౌసింగ్ మార్కెట్ కొత్త దశలోకి అడుగుపెడుతోంది. తక్కువ ఇళ్లు చేతులు మారుతున్నప్పటికీ, విలువ పరంగా కొత్త రికార్డు గరిస్ఠాలకు చేరుతోంది. ప్రపంచ అనిశ్చితి, యుద్ధ పరిస్థితుల వల్ల వాణిజ్య అస్థిరత, పెరిగిన ఆస్తి ధరల మధ్య గృహ కొనుగోలుదారుల బడ్జెట్ తగ్గకపోగా, పెరుగుతున్నదని ప్రముఖ కన్సల్టెంట్ సంస్థ అనరాక్ తన తాజా నివేదికలో పేర్కొంది. దీనివల్ల తక్కువ సంఖ్యలో ఇళ్ల అమ్మకాలే ఎక్కువ విలువను సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం, లగ్జరీ విభాగంలో ఇది స్పష్టంగా ఉందని నివేదిక అభిప్రాయపడింది. అనరాక్ డేటా ప్రకారం, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతం (ఎంఎంఆర్), ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్. కోల్‌కతా వంటి ప్రధాన ఏడు మార్కెట్లలో ఇళ్ల అమ్మకాల విలువ ఈ ఏడాది 20 శాతం పెరిగింది. కానీ, అమ్మకాల సంఖ్య 4 శాతం కంటే తక్కువగానే పెరిగాయి. ఈ ఎనిమిది నగరాల్లో మొత్తం 4,22,765 ఇళ్లు అమ్ముడుపోగా, వాటి విలువ రూ. 5.59 లక్షల కోట్లు ఉంది. అంటే, ఒక్కో ఇంటి ధర రూ. 1.3 కోట్ల వరకు ఉందని అనరాక్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంద్ రీసెర్చ్ హెడ్ ప్రశాంత్ ఠాకూర్ అన్నారు. హైదరాబాద్‌లో ఈ ఏడాది ప్రథమార్థం వరకు మొత్తం 22,345 ఇళ్లు అమ్ముడయ్యాయి. వాటి విలువ సుమారు రూ. 30,446 కోట్లుగా ఉందని నివేదిక పేర్కొంది.






