దేశంలో ఇంధన కొరత ప్రచారం.. ఆయిల్ సంస్థ క్లారిటీ

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-09 10:28:32  IST  )

భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తారాస్థాయికి చేరాయి.

దేశంలో ఇంధన కొరత ప్రచారం.. ఆయిల్ సంస్థ క్లారిటీ
X

దిశ, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ (India-Pakistan) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు తారాస్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ప్రత్యేక్ష యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనేక నకిలీ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్‌లపై కొరత ఏర్పడనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో ప్రజలు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. దీనిపై చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC) క్లారిటీ ఇచ్చింది.

ఈ వార్తల్లో వాస్తవం లేదని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. తమ వద్ద సరిపడా నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ మేరకు IOC తన X ఖాతాలో పోస్ట్‌ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల్లోనూ ఆయిల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని చెప్పింది. ఆయిల్ సరఫరా వ్యవస్థ సజావుగా పనిచేస్తోందని, ఇంధనం విషయంలో ఎవరికీ ఎలాంటి ఆందోళన అక్కర్లేదని స్పష్టం చేసింది. పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద క్యూ కట్టాల్సిన పనిలేదని పేర్కొంది.

Click For Tweet..

Next Story