- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Fuel Exports: ఇంధన ఎగుమతులకు బ్రేక్
ఈ ఎగుమతులు రోజుకు సుమారు 9.3 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. ఇది 2022, అక్టోబర్ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు మే నెలలో గణనీయంగా తగ్గి రోజుకు సుమారు 9.3 లక్షల బ్యారెళ్లకు చేరాయి. ప్రముఖ డేటా విశ్లేషణ సంస్థ 'కెప్లర్' నివేదిక ప్రకారం.. ఈ ఎగుమతులు రోజుకు సుమారు 9.3 లక్షల బ్యారెళ్లకు పడిపోయాయి. ఇది 2022, అక్టోబర్ తర్వాత నమోదైన అత్యల్ప స్థాయి కావడం గమనార్హం. ఈ భారీ తగ్గుదలకు ప్రధాన కారణం.. మనదేశంలోని చమురు రిఫైనరీల్లో ముందస్తు ప్రణాళిక ప్రకారం చేపట్టిన రిపేర్లు, మేయింటెనెన్స్ పనులే. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో ఈ నిర్వహణ పనులు జరగడం వల్ల.. ముడి చమురును శుద్ధి చేసే సామర్థ్యం తగ్గి, విదేశాలకు అమ్మడానికి సరిపడా ఇంధనం అందుబాటులో లేకుండా పోయింది. మరోవైపు, మనదేశంలో ఎల్‌పీజీ అవసరాలు బాగా పెరగడంతో రిఫైనరీలు తమ ఉత్పత్తి వ్యూహాన్ని మార్చుకున్నాయి. దేశీయంగా ఉన్న ఈ గ్యాస్ డిమాండ్‌ను తీర్చడం కోసం అవి పెట్రోల్, డీజిల్ ఉత్పత్తిని రోజుకు దాదాపు 80,000 బ్యారెళ్ల మేర తగ్గించి, ఆ సామర్థ్యాన్ని ఎల్‌పీజీ ఉత్పత్తికి మళ్లించాయి. దీనికి తోడు మన ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు కూడా దేశీయ ఇంధన భద్రతకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ, ఎక్కువ భాగాన్ని స్థానిక మార్కెట్లోనే విక్రయించాయి. వీటన్నిటితో పాటు ఎగుమతులపై ఉన్న పన్నులు, విదేశీ మార్కెట్లలో లాభాలు తగ్గడం కూడా ఎగుమతులు తగ్గడానికి కారణమయ్యాయి.






