- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
FSSAI: 'ఎనర్జీ డ్రింక్' పేరుతో తప్పుదోవ పట్టిస్తున్న బ్రాండ్లు
తమ ఉత్పత్తులను 'ఎనర్జీ డ్రింక్' పేరుతో విక్రయిస్తున్నప్పటికీ, అలాంటి ఉత్పత్తుల కోసం ప్రత్యేక ప్రమాణాలను ఇప్పటివరకు నోటిఫై చేయలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది.

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఎనర్జీ డ్రింక్ బ్రాండ్లపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కఠిన చర్యలు ప్రారంభించింది. తప్పుడు బ్రాండింగ్, తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నాయన్న ఆరోపణలతో రెడ్ బుల్, పెప్సికో, కాంపా, గోల్డ్ బూస్ట్ విక్రయించే రిలయన్స్ కన్స్యూమర్, స్టింగ్, హెల్ ఎనర్జీ, కోకాకోలా మద్దతు కలిగిన మాన్‌స్టర్ ఎనర్జీ వంటి మొత్తం ఆరు బ్రాండ్లకు నోటీసులు జారీ చేసింది. తమ ఉత్పత్తులను 'ఎనర్జీ డ్రింక్' పేరుతో విక్రయిస్తున్నప్పటికీ, అలాంటి ఉత్పత్తుల కోసం ప్రత్యేక ప్రమాణాలను ఇప్పటివరకు నోటిఫై చేయలేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. దీంతో బ్రాండింగ్, లేబెలింగ్ విషయంలో ఈ సంస్థలు నిబంధనలు ఉల్లంఘించాయా అనే అంశంపై విచారణ కొనసాగుతోంది. అంతేకాకుండా 'శరీరానికి శక్తినిస్తుంది', 'ఏకాగ్రత పెంచుతుంది', 'ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి', 'బలహీనతను తగ్గిస్తుంది' వంటి ఆరోగ్య ప్రయోజనాలను సూచించే ప్రకటనలు కూడా ఎఫ్ఎస్ఎస్ చట్టం-2006 ప్రకారం ఆహార ఉత్పత్తులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇటీవల తప్పుడు ప్రకటనలు, తప్పుదోవ పట్టించే వాదనలు, వినియోగదారుల ఫిర్యాదుల ఆధారంగా పలు ఆహార ఉత్పత్తుల కంపెనీలకు కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. ఆహార భద్రతపై వినియోగదారుల్లో అవగాహన పెంచేందుకు, ఇలాంటి చర్యలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ నిరంతరం వెల్లడిస్తోంది.






