Jobs: నవంబర్‌లో 30 శాతం పెరిగిన ఫ్రెషర్ల నియామకాలు

by S Gopi |

ఈ నియామకాలకు ఎక్కువగా హెల్త్‌కేర్, ఐటీ వంటి సాంప్రదాయ రంగాల మద్దతు లభించింది.

Jobs: నవంబర్‌లో 30 శాతం పెరిగిన ఫ్రెషర్ల నియామకాలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది నవంబర్‌లో ఫ్రెషర్ల నియామకాలు భారీగా పుంజుకున్నాయి. ముఖ్యంగా హాస్పిటాలిటీ, ఎడ్యుకేషన్ వంటి సేవల రంగాల కారణంగా గత నెలలో ఫ్రెషర్ల నియామకాలు 30 శాతం పెరిగాయని, 16 ఏళ్ల కంటే ఎక్కువ అనుభవం ఉన్న ఉద్యోగుల నియామకాల్లోనూ 27 శాతం వృద్ధి కనిపించిందని నౌక్రీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ తెలిపింది. ఈ నియామకాలకు ఎక్కువగా హెల్త్‌కేర్, ఐటీ వంటి సాంప్రదాయ రంగాల మద్దతు లభించింది. గతేడాదితో పోలిస్తే గత నవంబర్‌లో వైట్-కాలర్ నియామకాలు 6 శాతం పెరిగాయి. ఐటీ నియామకాలు స్థిరంగా ఉన్నప్పటికీ, అనేక ఐటీయేతర రంగాల్లో పెరుగుదల నమోదవడం గమనార్హం. ఎడ్యుకేషన్(44 శాతం), రియల్ ఎస్టేట్(40 శాతం), హాస్పిటాలిటీ/ట్రావెల్(రూ. 40 శాతం), బీమా(36 శాతం) రంగాలు అత్యధిక నియామకాల ధోరణిని చూశాయి.

ఏడాదికి రూ. 20 లక్షల ప్యాకేజీతో కూడిన అధిక వేతన ఉద్యోగాలు 38 శాతం, యూనికార్న్ కంపెనీల నియామకాలు 35 శాతం పెరిగాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (జీసీసీలు) కూడా 18 శాతం నియామకాల్లో వృద్ధిని చూశాయి. స్ట్రాటజీ అండ్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ జీసీసీలు 50 శాతం వృద్ధితో ముందంజలో ఉండగా, ఐటీ రంగ జీసీసీలు 9 శాతం పెరిగాయి. నవంబర్‌లో 27 శాతం ఈ-కామర్స్ కంపెనీల అవసరం నేపథ్యంలో యునికార్న్ నియామకాలు అత్యధిక వృద్ధిని చూశాయి. ఐటీ రంగానికి చెందిన యునికార్న్‌లు 16 శాతం ఎక్కువ నియామకాలు చేపట్టాయి. ఇక, దేశవ్యాప్తంగా ఎంట్రీ-లెవల్ నియామకాల్లో 30 శాతం పెరుగుదల కనిపించింది. ఈ ఏడాదిలో ఐటీయేతర రంగాలతో పాటు అధిక జీతం ఉన్న ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తున్నదని నౌక్రీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు.

Next Story